పాలస్తీనాపై దాడులను ఖండిద్దాం

పాలస్తీనాపై దాడులను ఖండిద్దాం
  •     అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ధర్నా 

ముషీరాబాద్,వెలుగు: పాలస్తీనాపై ఇజ్రాయిల్ వెంటనే దాడులను ఆపాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం  రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో సంఘం ఆధ్వర్యంలో ‘ పాలస్తీనాకు మద్దతుగా నిలబడదాం-.. ప్రపంచ శాంతికి పోరాడుదాం’ అంశంపై ధర్నా చేశారు. 

మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అధ్యక్షత వహించగా..  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ దిడ్డి సుధాకర్, మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఒబేదుల్లా, రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తున్నామని, దీనిపై ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు.