ఆర్టీసీ విలీనంపై చర్యలు తీసుకోండి

ఆర్టీసీ విలీనంపై చర్యలు తీసుకోండి

హైదరాబాద్​, వెలుగు :  ఎన్నికల హామీలలో భాగంగా ప్రభుత్వం ఆర్టీసీ విలీనంపై తక్షణ చర్యలు తీసుకోవాలని, కార్మిక సంఘాల పునరుద్ధరణపై వెంటనే స్పందించి అమలు చేయాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటి తీర్మానించింది. ఆదివారం రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో అన్ని స్థాయిల కమిటీ సభ్యులు పాల్గొని పలు తీర్మానాలను ఆమోదించారు. 

అపరిష్కృతంగా ఉన్న 2017, 2021 వేతన సవరణ అమలు, 2013 వేతన సవరణ బకాయిల బాండ్ల చెల్లింపు ఎలక్షన్ కోడ్ రాకముందే ఆదేశాలు ఇచ్చి కార్మికుల అనుమానాలు నివృత్తి చేయాలని తీర్మానించారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్ ద్వారా నియమించబడిన అందరిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని, మెడికల్ అన్ ఫిట్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాల కల్పించాలని, పీఎఫ్​, సీసీఎస్​సంస్థల నుంచి సంస్థ వాడుకున్న నిధులను తక్షణం విడుదల చేయాలని, రీజినల్ పీఎఫ్​కమిషనర్ ఆఫీస్ కు సంస్థ చెల్లించాల్సిన బకాయిల చేయకపోవడంతో  పీఎఫ్​హయ్యర్ పెన్షన్ పైన కార్మికుల్లోని సందేహాలను తొలగించాలని డిమాండ్ చేశారు. 

మహాలక్ష్మి స్కీమ్ ద్వారా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు. ఇందుకు బస్సుల కొనుగోలుకు బడ్జెట్లో 2 శాతం నిధులు కేటాయించడంతో పాటు ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తీర్మానించారు. ఈ సమావేశం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ గౌడ్ , ముఖ్య సలహాదారు బి.యాదయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ జీపీఆర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.