తెలంగాణ అప్పు రూ.8.64 లక్షల కోట్లు ! పాత బాకీలు తీర్చేందుకు కొత్తగా అప్పు

తెలంగాణ  అప్పు రూ.8.64 లక్షల కోట్లు ! పాత బాకీలు తీర్చేందుకు కొత్తగా అప్పు
  • రాష్ట్ర అప్పు రూ.8.64 లక్షల కోట్లు!
  • రెగ్యులర్​ అప్పులు రూ.5.62 లక్షల కోట్లు
  • గ్యారంటీలు, కార్పొరేషన్ బాకీలు 
  • మరో రూ.3.01 లక్షల కోట్లు
  • రాష్ట్రంలో ఒక్కొక్కరిపై అప్పు 
  • రూ. 2.46 లక్షలు
  • పాత బాకీలు తీర్చేందుకు కొత్తగా అప్పు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకంతకూ ఆందోళనకరంగా మారుతున్నది. 2026–-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రం ఎంత వేగంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదో అర్థమవుతున్నది. వచ్చే 2027 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 8.64 లక్షల కోట్లకు చేరనున్నాయి. ఇందులో ప్రభుత్వం నేరుగా చేసే ఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌బీఎం పరిధిలోని చేసిన అప్పులు రూ. 5.62 లక్షల కోట్లు కాగా, 
గ్యారంటీలు, కార్పొరేషన్ల బాకీలు కలిపి మరో రూ. 3.01 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలో  ఒక్కొక్కరిపై రూ.2.46 లక్షల అప్పు ఉంది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలుకు నిధుల వేట కొనసాగిస్తూనే,  మరోవైపు పాత అప్పులకు వడ్డీలు, అసలు కట్టాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. 
జీఎస్డీపీలో ఏకంగా 29 శాతానికి.. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సర్కారు ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌బీఎం పరిధిలోని నేరుగా చేసే అప్పులే రూ. 5,62,363 కోట్లకు చేరుకోనున్నాయి. ఇది రాష్ట్ర జీఎస్‌‌‌‌డీపీలో ఏకంగా 29 శాతం కావడం గమనార్హం. 


సాధారణంగా ఈ మొత్తం 25 శాతంలోపే ఉండాలి. గత 2023-–24లో 27 శాతంగా ఉన్న ఈ అప్పుల శాతం, కేవలం మూడేండ్లలోనే 29 శాతానికి పెరగడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతుందనడానికి నిదర్శన మని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అప్పులకు తోడు ప్రస్తుత ప్రభు త్వం కూడా పాలన సాగించడానికి ప్రతి ఏటా కొత్తగా అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేవలం వచ్చే సంవత్సరంలోనే బహిరంగ మార్కెట్ నుంచి రూ. 73,383  కోట్ల రుణాలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కాకుండా కేం ద్రం నుంచి రూ.5,500 కోట్లు, ఇతర లోన్లు వెయ్యి కోట్లు, ఇతర డిపాజిట్లు, అడ్వాన్స్‌‌‌‌లతో రూ.2,986 కోట్లు అప్పు తీసుకోనున్నట్టు వెల్లడించింది. ఇలా మొత్తంగా రూ.82 వేల కోట్లు దాటనున్నది. 


గ్యారంటీ కిస్తీల చెల్లింపులకు తిప్పలు ఇటు కార్పొరేషన్లు ఇతర సంస్థలకు సర్కారు గ్యారంటీ పై  తీసుకున్న అప్పులు కూడా కొండలా పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉన్న అప్పులు రూ.2,41,743 కోట్లు ఉండ గా, గ్యారంటీ లేని కార్పొరేషన్ అప్పులు మరో రూ. 60,092 కోట్లు ఉన్నాయి. వెరసి, నాన్- ఎఫ్‌‌‌‌ఆర్​బీఎం అప్పులే రూ.3,01,835 కోట్లకు చేరుకున్నాయి. ఈ రుణాలకు సంబంధించి వడ్డీలు, కిస్తీలు చెల్లించడం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 2026–-27లో రూ.1,48,186 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, అందు లో దాదాపు సగం మొత్తం పాత అప్పుల చెల్లింపులకే వెచ్చించాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలతో దేశంలోనే ముందున్నామని చెప్పుకుంటున్నా, దానికి సమాంతరంగా ప్రతి పౌరుడిపై లక్షలాది రూపాయల అప్పుల భారం పెరుగుతున్నది. ఒకవైపు ప్రభుత్వం తన ఫిస్కల్ పాల సీ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో అప్పులను నియంత్రిస్తామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అంకెలు అందుకు భిన్నంగా ఉన్నా యి. అప్పుల ఊబి నుంచి గట్టెక్కేందుకు తక్కువ వడ్డీ రుణాల వైపు మళ్లుతున్నామని, ఆఫ్ -బడ్జెట్ రుణాలను బడ్జెట్ పరిధిలోకి తెస్తున్నామని ప్రభుత్వం వివరిస్తున్నా, అసలు రుణభారం మాత్రం  పెరుగుతూనే ఉన్నది.