లక్సెట్టిపేట వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దని గ్రామ పంచాయతీ ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు పి.మనోహర్ సూచించారు. గురువారం పట్టణంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల సర్పంచ్ అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామస్థాయి ఎన్నికలు చాలా కీలకమన్నారు.
అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ అభ్యర్థులు విద్వేషాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర చాలా కీలకమని తెలిపారు. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి రూ.లక్షా 50 వేలు, వార్డు సభ్యులు రూ.30 వేలకు మించి ఖర్చు చేయొద్దన్నారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజేశ్వర్, తహసీల్దార్లు దిలీప్ కుమార్, శ్రీనివాసరావు దేశ్ పాండే, రోహిత్ దేశ్ పాండే, రాజమనోహర్ రెడ్డి, సీఐ నరేశ్ కుమార్, ఎస్సైలు సురేశ్, తహసీనుద్దీన్, అనూష, స్వరూప్ రాజ్, ఎంపీడీవో సరోజ తదితరులు పాల్గొన్నారు.
