బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రాష్ట్ర ఖజానా ఖాళీ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రాష్ట్ర ఖజానా ఖాళీ  :  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో  వివిధ శాఖల నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో రాష్ట్రం లోని ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముభారక్ చెక్కులను అందజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నల్లాల ఓదెలు,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..  రాష్ట్రంలో ప్రజలకు ప్రజా పాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు.  సింగరేణి సంస్థలో కొత్త గనులను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.