హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన అనంతరం, వాటికి సంబంధించి కీలక అధికారుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. జీహెచ్ఎంసీలోని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న రవికిరణ్‌కు శానిటేషన్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. అడ్మిన్ అదనపు కమిషనర్‌గా కె సత్యనారాయణ, చీఫ్ సిటీ ప్లానర్‌గా కె శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్‌గా ఎస్ రత్నాకర్‌ను నయమించింది.
ఇక మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అదనపు కమిషనర్ గా సీఎన్ రఘు ప్రసాద్, అడ్మిన్ అదనపు కమిషనర్ గా కె వేణుగోపాల్, చీఫ్ సిటీ ప్లానర్ గా కె ప్రదీప్ కుమార్ చీఫ్ ఇంజినీర్ గా వి. అశోక్ రెడ్డిని నియమించింది. అలాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అదనపు కమిషనర్ ఎన్. యాదగిరిరావు, అడ్మిన్ అడిషనల్ కమిషనర్ గా బి గీతా రాధి, చీఫ్ సిటీ ప్లానర్ గా బి వెంకన్న, చీఫ్ ఇంజినీర్ గా ఎస్. నిత్యానందంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
