
యాదాద్రి, వెలుగు : ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం రెండో విడత ఎగుమతి చేసేందుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల వారీగా ఎంత పంపాలనే టార్గెట్ఇంకా నిర్దేశించలేదు. గతేడాది రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిలిప్పీన్స్ అధికారులతో బియ్యం ఎగుమతిపై చర్చించారు. దాదాపు లక్ష టన్నులకు అగ్రిమెంట్ చేసుకుని విడతల వారీగా పంపించేందుకు నిర్ణయించారు.
దీంతో తొలి విడత బియ్యం ఎగుమతి ఇప్పటికే పూర్తి కావచ్చింది. కాగా.. బియ్యంలో నూక 5 శాతానికి మించకుండా ఉండాలని అధికారులు కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. అయితే.. 2022 – -23 యాసంగి సీజన్టెండర్వడ్లను మరాడించి బియ్యం ఇవ్వాలని ఇప్పటికే మిల్లర్లకు సివిల్ సప్లయ్ కమిషనర్ డీఎస్చౌహాన్సూచించారు. అయితే సీఎంఆర్‌కు 25 శాతం నూకను ఇచ్చేలా ప్రభుత్వం ఒప్పుకునేది.
ఇప్పుడు 5 శాతం నూకతోనే ఆ దేశానికి బియ్యం పంపాల్సి ఉంది. దీంతో 95 శాతం హెడ్ రైస్అందించాలి. 20 శాతం నూకను భరిస్తుండగా క్వింటాల్‌కు రూ. 300 మిల్లర్లకు ఇస్తున్నారు. బియ్యం ప్యాకింగ్ కు ప్రత్యేకంగా గన్నీ బ్యాగులను సివిల్సప్లయ్డిపార్ట్మెంట్అందిస్తోంది. కాగా తొలి విడతలో ఎగుమతి చేసే 12,500 టన్నుల్లో ఇప్పటికే సగానికి మించి కాకినాడ పోర్టుకు చేరగా షిప్‌లోకి చేరవేస్తున్నారు.
రెండో విడతలో 27,500 టన్నులు
రెండో విడతలో మరో 12,500 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు సివిల్సప్లయ్డిపార్ట్మెంట్తాజాగా నిర్ణయం తీసుకోగా.. జిల్లాల వారీగా టార్గెట్ పెట్టలేదు. అయితే.. 2022– -23 యాసంగి సీజన్లో టెండర్వడ్లకు సంబంధించిన మిల్లులకు అప్పగించాల్సిన బకాయిలపై లెక్కలు తీస్తున్నారు. ఇవి పూర్తి కాగానే జిల్లాల వారీగా కేటాయింపు జరుగుతాయని సివిల్సప్లై అధికారులు తెలిపారు.