వర్సిటీ రిక్రూట్‌‌మెంట్ బోర్డుకు ఓకే

వర్సిటీ రిక్రూట్‌‌మెంట్ బోర్డుకు ఓకే
  • వర్సిటీ రిక్రూట్‌‌మెంట్ బోర్డుకు ఓకే
  • ఫైల్‌‌పై సంతకం చేసిన సీఎం కేసీఆర్


హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీ రిక్రూట్‌‌మెంట్ బోర్డుకు రాష్ట్ర సర్కారు గ్రీన్‌‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌‌పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఇప్పటిదాకా ఏ యూనివర్సిటీ పరిధిలోని ఖాళీలను ఆయా వర్సిటీలే భర్తీ చేసుకునే వీలుండేది. ఈ క్రమంలో కామన్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఏప్రిల్‌‌లో జరిగిన కేబినెట్‌‌ భేటీలో నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ బోర్డు ద్వారానే వర్సిటీలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేయనున్నారు. ఇప్పటికే 3,500కు పైగా వర్సిటీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన సర్కారు.. వాటి భర్తీకి చర్యలు ప్రారంభించనుంది. మరోవైపు ప్రస్తుతమున్న వర్సిటీల యాక్ట్‌‌లను మార్చాల్సి ఉంది. వర్సిటీ ఈసీల్లోనూ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ తర్వాతే  రిక్రూట్‌‌మెంట్ బోర్డు ద్వారా పోస్టులను  భర్తీ చేసే అవకాశముంది.


కేసీఆర్‌‌‌‌ను కలిసిన మంత్రి సబిత


సీఎం కేసీఆర్‌‌‌‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం కలిశారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఏడు రోజుల పాటు జరిగిన ఆందోళనలు, సోమవారం రాత్రి స్టూడెంట్లతో జరిగిన చర్చల సారాంశాన్ని సీఎంకు ఆమె వివరించారు. స్టూడెంట్లకు ఇచ్చిన హామీల గురించి చెప్పారు. వీసీ నియామకంపైనా చర్చించారు.