RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ ప్రకటించిన రాష్ట్ర సర్కార్

RTC  ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ ప్రకటించిన రాష్ట్ర సర్కార్

హైదరాబాద్: RTC  ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. 21 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ని ప్రకటించింది. 2017 PRC  పూర్తి స్థాయిలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు పీఆర్సీ పెంపు విషయాన్ని మీడియాలో సమావేశంల వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ.. పీఆర్సీ ప్రకటనతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆర్టీసీని ఆదుకుంటుందన్నారు.  ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమంగా కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 2017 పీఆర్సీ పూర్తి స్థాయిలో ఇవ్వాలనుకుంటున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్షీ పథకంలో భాగంగా 3 నెలల్లో 25 కోట్ల  మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేశారన్నారు.  మహిళలకు ఫ్రీ జర్నీ ఇస్తుంటే బీఆర్ ఎస్ ఓర్వలేక పోతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో డ్రైవర్ పేరుతో నానా యాగీ చేస్తుందని విమర్శించారు. 

Also read : ఎస్బీఐ బ్యాంకులో భారీ స్కాం.. రూ. 2.80 కోట్లతో ఉడాయించిన మేనేజర్

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృతజ్ణతలు తెలిపారు. వచ్చే 2 నెలల్లో 2వేలకు పైగా కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృతజ్ణతలు తెలిపారు. వచ్చే 2 నెలల్లో 2వేలకు పైగా కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. పీఆర్సీ పెంపుతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.