ఎర్రమంజిల్ కూల్చివేతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఎర్రమంజిల్ కూల్చివేతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

కారణం లేకుండా లిస్ట్ నుంచి ఎలా తొలగిస్తారు?

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఎర్రమంజిల్ కూల్చివేత నిర్ణయంపై నేడు కూడా వాదనలు

ఎర్రమంజిల్ ప్లేస్ లో అసెంబ్లీ బిల్డింగ్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌ కట్టాలని సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ దాఖలైన పిల్స్ పై  హైకోర్టు డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ సోమవారం విచారణ కొనసాగించింది. హుడా లిస్ట్‌‌‌‌ నుంచి బిల్డింగ్‌‌‌‌ను తొలగించినా అందుకు కారణాలు చెప్పలేదని, కారణాలు లేకుండా ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికీ  హెచ్ఎండీఏ మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌‌‌లో బిల్డింగ్‌‌‌‌ ఎలా ఉంటుందని నిలదీసింది. చట్టంలో రద్దు చేసి మాస్టర్ ప్లాన్ లో ఉంచితే దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని చెప్పింది.   అంతకు ముందు వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచందర్ రావు.. ఎర్రమంజిల్‌‌‌‌ హెరిటేజ్ లిస్ట్‌‌‌‌లో లేదని, హైదరాబాద్‌‌‌‌ జిందాబాద్‌‌‌‌ ఎన్జీవో, ఇతరులు వేసిన పిల్స్‌‌‌‌ను కొట్టివేయాలని కోర్టును కోరారు. హెరిటేజ్ లిస్ట్‌‌‌‌లో ఉన్న భవనాన్ని ఏ ప్రాతిపదికపై తొలగించారో  వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.