కల్తీ కల్లు ఘటనపై ఆగస్టు 20లోగా నివేదికివ్వండి

కల్తీ కల్లు ఘటనపై ఆగస్టు 20లోగా నివేదికివ్వండి
  •  ప్రభుత్వానికి రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కల్తీ కల్లు ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (ఎస్​హెచ్ఆర్సీ) స్పందించింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు ఆధారంగా.. కేసు నమోదు చేసింది.ఘటనపై ఆగస్టు 20లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని రెవెన్యూ (మధ్య నిషేధం, ఆబ్కారీ) శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.

కల్తీ కల్లు కారణంగా ఎంతమంది మరణించారు? ఎంత మంది మత్తుకు బానిసలయ్యారు? ఆబ్కారీ శాఖ తీసుకున్న చర్యలేమిటి? అధికారుల బాధ్యతారాహిత్యంపై ఎలాంటి చర్యలు చేపట్టారు? శాఖాపరమైన చర్యలు ఏమిటి? ఎన్ని కల్లు కాంపౌండ్లు సీజ్ చేశారు? నష్టపరిహారం చెల్లించారా? భవిష్యత్తులో కల్తీ కల్లును నిరోధించేందుకు ఏ చర్యలు చేపడతారని సంఘం ప్రశ్నించింది.ఈ అంశాలపై సమగ్ర నివేదికను ఆగస్టు 20లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలో ఇటీవల జరిగిన కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్, ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ అధికారులు కల్లు కాంపౌండ్లపై తనిఖీలు నిర్వహిస్తున్నారు.