అలియా భట్ లీడ్ రోల్‌లో రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్‌ను సోమవారం ప్రకటించారు. జులై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. నిజానికి గతేడాది క్రిస్మస్‌కు ఈ సినిమా రిలీజ్ కావల్సి ఉండగా వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో వాయిదాపడింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వస్తోందని ప్రచారం జరిగినప్పటికీ ఏప్రిల్ 17న తప్పకుండా వస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో నేరుగా ఓటీటీలోకి రాబోతోందనే టాక్ వినిపించింది. అయితే మేకర్స్ మాత్రం జూలైలో రిలీజ్ అని మరో కొత్త తేదీని ప్రకటించారు. శార్వరీ వాఘ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తోన్న ఫస్ట్ లేడీ స్పై యాక్షన్ మూవీ కావడంతో అంచనాలు నెలకొన్నాయి. హృతిక్‌రోషన్ సహా ఈ స్పై యూనివర్స్‌లో నటించిన హీరోలందరూ ఇందులో గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నట్టు సమాచారం.
