రాష్ట్ర స్థాయి కళాఉత్సవం షురూ..విద్యార్థుల్లో సమగ్రత, ఐక్యత వంటి విలువలు పెరగాలి

రాష్ట్ర స్థాయి కళాఉత్సవం షురూ..విద్యార్థుల్లో సమగ్రత, ఐక్యత వంటి విలువలు పెరగాలి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లోని కళా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు విద్యాశాఖ  రాష్ట్రస్థాయి కళా ఉత్సవం ప్రారంభించింది. గురువారం రాజేంద్రనగర్‌‌‌‌లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో సమగ్ర శిక్ష జేడీ రాజీవ్‌‌‌‌తో కలిసి ఏఎస్‌‌‌‌పీడీ రాధారెడ్డి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాధారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సమగ్రత, ఐక్యత వంటి విలువలను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. వితొలిరోజు వోకల్ మ్యూజిక్, గ్రూప్ డ్యాన్స్, ఇన్‌‌‌‌స్ట్రుమెంటల్ మ్యూజిక్, విజువల్ ఆర్ట్స్ (2డీ, 3డీ), గ్రూప్ థియేటర్ విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు అధికారులు బహుమతులు అందజేశారు.రెండో రోజు శుక్రవారం వోకల్ మ్యూజిక్ (గ్రూప్), క్లాసికల్ డ్యాన్స్ (సోలో), ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.