
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీ నేతల కు ఇష్టం లేదని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, తెలంగాణలో రిజర్వేషన్లు ఇస్తామంటే బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని అన్నారు. గురువారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
వెనకబడిన ముస్లిం లకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రధాని మోదీ చెపు తున్నారని, తెలంగాణలో కూడా వెనకబడిన ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించాలని తాము కోరుతున్నామని చెప్పారు. ముస్లింలం దరికీ రిజర్వేషన్లు ఇవ్వాలని తాము కూడా కోరడం లేదన్నారు.