దేశంలో తెలంగాణ పోలీసులు బెస్ట్: రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్త్

దేశంలో తెలంగాణ పోలీసులు బెస్ట్: రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్త్
  • రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్త్​  

ఖిలా వరంగల్(మామునూరు), వెలుగు : దేశంలోనే తెలంగాణ పోలీసు ది బెస్ట్ గా ప్రత్యేక గుర్తింపు పొందారని రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్త్​ పేర్కొన్నారు. వరంగల్ పోలీసుల ఆధ్వర్యంలో మామునూరులోని పోలీసు ట్రెనింగ్ సెంటర్ లో 2వ రాష్ట్రస్థాయి పోలీసు డ్యూటీ మీట్ – 2025 గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో  పోలీసుల పనితీరు బాగుందని, టెక్నాలజీ వినియోగంతో పాటు నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారన్నారు. జాబ్ తో పాటు ఇలాంటి డ్యూటీమీట్ లు పోలీసులకు అవసరమన్నారు.

 క్రమశిక్షణతో ఆటల్లో నైపుణ్యతను ప్రదర్శించాలన్నారు. గతంలో జరిగిన ఆల్ ఇండియా పోలీసు డ్యూటీమీట్ లో 18 మోడల్స్ ను గెలుపొందారని గుర్తు చేశారు. 25 ఏండ్ల కింది వరంగల్ పీటీసీలో ప్రిన్సిపల్ గా పనిచేశానని చెప్పారు. వరంగల్ పోలీసుల ఆధ్వర్యంలో 2వ  రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీమీట్​నిర్వహించడం అభినందనీయని అడిషనల్ డీజీపీ మహేశ్​ భగవత్​అన్నారు.  క్రీడాకారులు విజయాలపై  ఫోకస్​ చేసి.. సాధన చేస్తే ఏదైనా సాధ్యమేన న్నారు. కార్యక్రమంలో వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, డీసీపీ షేక్​ సలీమా, అంకిత్ కుమార్, పీటీసీ ప్రిన్సిపల్ ఇంజారపు పూజ పాల్గొన్నారు.