కల్లుగీత వృత్తి పై పట్టింపు లేని ప్రభుత్వాలు : ఎంవీ.రమణ

కల్లుగీత వృత్తి పై  పట్టింపు లేని ప్రభుత్వాలు :  ఎంవీ.రమణ
  •     కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణలో 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, గీతకార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నాయని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ.రమణ అన్నారు. ఈ నెల 28న సూర్యాపేటలో గీతన్నల రణభేరి సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటనరసయ్య అధ్యక్షతన రణభేరి పోస్టర్​ను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి ఒక్క పథకం కూడా పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేశ్​గౌడ్, అంబాల శ్రీనివాస్, ప్రభాకర్ గౌడ్, రమేశ్​ గౌడ్, బాలరాజు పాల్గొన్నారు.