V6 News

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తాం : రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ  చైర్మన్అన్వేష్ రెడ్డి

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తాం : రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ  చైర్మన్అన్వేష్ రెడ్డి

లింగంపేట, వెలుగు: వానాకాలం సీజన్​లో రైతులకు నాణ్యమైన వరి విత్తనాలు అందిస్తామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్​​రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్​పల్లి, నాగిరెడ్డిపేట మండలంలోని వెంకంపల్లిలో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. వారు సాగుచేస్తున్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతులతోనే విత్తనాలను ఉత్పత్తి చేయిస్తోందని, వాటిని పరీక్షించిన తర్వాత నాణ్యమైనవాటిని రైతులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు.

ఖరీఫ్ సీజన్​కు అవసరమైన సన్న, దొడ్డ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు సూచించిన విత్తన రకాలను సాగుచేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మోహన్​ రెడ్డి, ఎల్లారెడ్డి ఏడీఏ రత్న, ఆత్మ కమిటీ చైర్మన్​ దశరథ్​నాయక్, మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.​