హైదరాబాద్, వెలుగు: స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూటీఎస్) హైదరాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం, ఎన్నికలు కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగాయి. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ దృష్ట్యా పాఠశాలల ఉదయపు సమయాల్లో వెసులుబాటు కల్పించాలని, బోధనేతర పనుల భారం తగ్గించి, తరగతి గది బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు.
అనంతరం జరిగిన ఎన్నికలలో... గత రెండేండ్లలో వారి సేవలకు గుర్తింపుగా జిల్లా అధ్యక్షులుగా పి. రామ సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఇఫ్తికారుద్దీన్, జిల్లా ఆర్థిక కార్యదర్శిగా భూపాల్ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు.
తమపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పించినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన నూతన కార్యవర్గం, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, డీఏలు, పీఆర్సీ అమలుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఉపాధ్యాయులకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
