వాహనాల సమస్యతో కొనుగోళ్లలో జాప్యం జరుగొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

వాహనాల సమస్యతో కొనుగోళ్లలో జాప్యం జరుగొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట రూరల్, వెలుగు: వాహనాల సమస్యతో ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వ ఉండొద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ కె.హైమావతి, సీపీ సాధన రష్మీ పెరుమాళ్‌తో కలిసి వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌ పోర్ట్‌ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంచనాకు మించి జిల్లాలో ఈ యాసంగిలో 4 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 54 రైస్ మిల్లులలో దాదాపు 1000 మంది హమాలీల ద్వారా  ధాన్యం దించుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, సివిల్ సప్లై అధికారులు తనూజ, మేనేజర్ గోపికృష్ణ, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీటీవో లక్ష్మణ్, డీసీవో వరలక్ష్మి, మార్కెటింగ్ అధికారి నాగరాజు, డీఏవో స్వరూపారాణి, కార్మిక శాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.