బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు

బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఆదేశించింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న కమిషన్  వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.  ఇదే ఘటనపై బీఆర్ఎస్ నేతలు, మహిళా కార్పొరేటర్లు బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

అయితే  బీజేపీ మహిళా నేతలు మహిళ కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.   రాష్ట్రంలో అసలు మహిళా కమిషన్ ఉందా అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముందని ప్రశ్నించారు.  గవర్నర్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసినపుడు మహిళా కమిషన్ ఎక్కడ ఉందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కవిత ఒక్కరే మహిళనా? మిగతా వాళ్లు మహిళలు కాదా? అంటూ ధ్వజమెత్తారు.