బాల్య వివాహాలు జరగకుండా చూడాలి :  రాగ జ్యోతి

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి :  రాగ జ్యోతి

మెదక్ టౌన్, వెలుగు:  జిల్లా వ్యాప్తంగా బాల్యవివాహాలు జరగకుండా చూడాలని  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​ సభ్యురాలు రాగ జ్యోతి అన్నారు. శనివారం కలెక్టరేట్‌‌లో​జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  'జిల్లాలో బాల్య వివాహాలు -  నిర్మూలన' అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాగజ్యోతి మాట్లాడుతూ...అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి కాకుండా వివాహాలు జరిపిస్తే చట్టరీత్యా నేరమన్నారు.

ఈ విషయంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సభ్యులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాల్యవివాహాలు తగ్గించేందుకు మెదక్​ జిల్లాను పైలెట్​ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​,  ఏఎస్పీ మహేందర్​, డీడబ్ల్యువో బ్రహ్మాజీ, డీఈవో రాధాకిషన్​, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, సీడీపీవోలు హేమభార్గవి, స్వరూప, సీడబ్ల్యుసీ చైర్మన్​ వెంకట్​రావు, సభ్యులు ఉప్పలయ్య, డీఎస్​వో రాజిరెడ్డి, బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ జెమ్లానాయక్​ పాల్గొన్నారు.