
స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘనపూర్ కు తానే సుప్రీమని చెప్పారు. ప్రస్తుతం ఘన్ పూర్ నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే తనకు నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదన్నారు.
జనగామ జిల్లా కేశవనగర్ లో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు రాజయ్య. డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా, కోలాటమాడాలన్నా ఎందుకు భయపడుతున్నారని కళాకారులను ప్రశ్నించారు రాజయ్య. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేగా ఉంటాన్నారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు రాజయ్య.
Also Read :- కూకట్ పల్లి నుంచి పోటీపై బండ్ల గణేష్ క్లారిటీ
స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను కడియం శ్రీహరికి కేటాయించడంతో రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత కొన్ని రోజులుగా రాజయ్య పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేసీఆర్ రాజయ్యను రైతుబంధు ఛైర్మన్ గా నియమించారు.