
కూకట్ పల్లిలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారనే ప్రచారంపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ క్లారిటీ ఇచ్చారు. తాను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యనని చెప్పారు. రేవంత్ రెడ్డి తనకు అవకాశం ఇస్తానని చెప్పారు కానీ ఈసారి టికెట్ వద్దని బండ్ల గణేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యమని.. దానికోసం పనిచేస్తానని తెలిపారు. తాను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదన్నారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే తన ధ్యేయమని.. తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామన్న బండ్ల అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో జరిగిన గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బండ్ల గణేష్ ప్రచారం చేశారు. బండ్ల ఇచ్చిన చాలా ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి. బండ్ల గణేష్ మీద బ్లేడుపై సెటైర్లు కూడా వచ్చాయి. అయితే ఈసారి కూకట్ పల్లి టికెట్ బండ్ల గణేష్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తోందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో బండ్ల క్లారిటీ ఇచ్చారు.
నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి గారు నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు.…
— BANDLA GANESH. (@ganeshbandla) October 8, 2023
Also Read :- తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
మరో రెండు రోజుల్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.