కేరళలో రైలును ఆపి వందల మంది ప్రాణాలు కాపాడిన వాచ్మెన్.. వీడియో ఇదే..

కేరళలో రైలును ఆపి వందల మంది ప్రాణాలు కాపాడిన వాచ్మెన్.. వీడియో ఇదే..

వయనాడ్: కేరళను భారీ వర్షాలు శోకసంద్రంలోకి నెట్టేశాయి. కేరళలోని వయనాడ్ జిల్లాలో గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయిన విషాద పరిస్థితులు నెలకొన్నాయి. 85 మందికి పైగా సజీవ సమాధి కావడంతో కేరళ పెను విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో కేరళ వరదలకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అయింది. రైల్వే ట్రాక్స్పై వరద నీరు పొంగిపొర్లుతున్న వీడియో అది.

 

అంతేకాదు.. ఆ రైల్వే ట్రాక్ను ముంచెత్తేందుకు వరద నీరు యమా స్పీడ్గా పారుతోంది. ఆ సమయంలో రైలు ఆ పట్టాల పైకి వచ్చి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఒక స్టేషనరీ వాచ్మెన్ అప్రమత్తమై రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ నంబర్.16526 అదే సమయంలో ట్రాక్ మీదకు వస్తుండగా స్టేషనరీ వాచ్మెన్ రైలును ఆపాడు. దీంతో రైలు ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇదిలా ఉండగా.. కేరళలో వర్షాల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కొన్ని రైళ్ల దారి మళ్లించారు. 

రద్దైన రైళ్ల వివరాలివి..
1. ట్రైన్ నంబర్ 06445
2. ట్రైన్ నంబర్ 06446
3. ట్రైన్ నంబర్ 06497
4. ట్రైన్ నంబర్ 06496

కేరళలో వరదల కారణంగా వరద నీరు పట్టాల పైకి  చేరడంతో రైల్వే శాఖ నాలుగు రైళ్లను రద్దు చేసింది. 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. రెండు రైళ్లను రీషెడ్యూల్ చేసింది.