ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సారీ చెప్పిన ఎమ్మెల్యే

V6 Velugu Posted on Sep 26, 2021

జనగామ జిల్లా: అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన  స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు సారీ చెప్పారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండలో చేపల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. 
అయితే స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ సమాచారం ఇవ్వడం మరచిపోయారని, తాము అధికార పార్టీకి చెందిన వారిమి అయినా ఎమ్మెల్యే తమ గ్రామానికి వస్తున్న విషయం తమకే తెలియకుండా వచ్చారంటూ సభా వేదికపైనే ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి వచ్చేటప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధులకు కనీసం సమాచారం ఇవ్వరా అని వేదికపైనే నిలదీశారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ఈవిషయంలో తన ప్రమేయం లేదని... ఒకవేళ తప్పుగా భావిస్తే తనను క్షమించాలన్నారు.
 

Tagged Janagama district, , Stationghanapur MLA, Namiligonda village, mla Thatikonda Rajaya, mla apologized to MPTC and ZPTC

Latest Videos

Subscribe Now

More News