Vastu Tips : విల్లాలో మెట్ల కింద ఖాళీ ఉండటం మంచిదా.. కాదా..?

Vastu Tips : విల్లాలో మెట్ల కింద ఖాళీ ఉండటం మంచిదా.. కాదా..?

వాస్తు ప్రకారం మెట్ల కింద ఖాళీ ఉండాలా.. లేదా అక్కడ చిన్న గదిని కట్టుకొని ఉపయోగించుకోవచ్చా.. వాష్​ రూం లాంటి వాటిని నిర్మిస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయా.. ఎదురుగా ఉన్న ఇంటిలోకి మారితే సమస్యలు వస్తాయా.. వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​గారు సూచనలను తెలుసుకుందాం. . .

 ప్రశ్న: ఇంటికి ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయి. వాకిలి తూర్పువైపు ఉంది. మెట్ల కింద బాత్ రూం లాంటివి ఏమీ కట్టలేదు మెట్ల కింద ఖాళీ స్థలం ఉండకూడదని కొందరు చెప్పారు. మెట్ల కింద పాతసామాను. వాషింగ్ మిషిన్ లాంటివి పెట్టుకోవచ్చా? ఖాళీగా ఉంచినా పర్వాలేదా? 

జవాబు: మెట్ల కింద కచ్చితంగా బాత్రూం కట్టుకోవాలనేం లేదు. ఆగ్నేయం అంటున్నారు కాబట్టి, అది సమస్య కాదు. పాతసామాన్లు పెట్టుకున్నా, వాడే వస్తువులు ఉన్నా, వాస్తు ప్రకారం ఎలాంటి నష్టం జరగదు. ఆగ్నేయం కాబట్టి ఖాళీగా వదిలేసినా మంచిదే. మీ అవసరాన్ని బట్టి ఆ స్థలాన్ని వాడుకోండి

ఎదురింటికి మారొచ్చా? 

ప్రశ్న:మేం ఇల్లు మారాలని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న ఇల్లు, కొత్తగా మారాలనుకున్న ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి. మధ్యలో రోడ్ ఉంది. ఇప్పుడున్న ఇంటి వాకిలి దక్షిణం దిక్కులో ఉంటే, మారే ఇంటి వాకిలి తూర్పు దిక్కులో ఉంది. మెయిన్ గేట్లు మాత్రం ఎదురెదురుగా ఉన్నాయి. మేం మారడం పల్ల ఇబ్బందులేమన్నా వస్తాయా? 

జవాబు: దక్షిణం వాకిలి ఉన్న ఇంటి నుంచి తూర్పు వాకిలి ఉన్న ఇంటికి మారడం మంచిదే. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫోర్కు మారడం వల్ల ఎలాంటి సమస్య రాదు. మధ్యలో రోడ్ ఉండటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. వంటిల్లు, సంపు, హాలు, పడకగదులు ఏఏ దిక్కులో ఉన్నాయో తప్పనిసరిగా చూపించుకుని, ఇల్లు మారండి.