టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు..!

టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు..!

ధనాధన్ క్రికెట్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దుమ్మురేపుతున్నాడు. బిగ్ బాష్ లీగ్లో  ఓపెనర్గా బరిలోకి దిగిన స్మిత్..వరుసగా రెండో సెంచరీ కొట్టాడు. సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్టీవ్ స్మిత్..గురువారం అడిలైడ్ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 56 బంతుల్లోనే శతకం బాదాడు. శనివారం సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ  56 బంతుల్లోనే స్మిత్ సెంచరీ చేశాడు. బిగ్ బాష్ లీగ్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్..టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు కొట్టిన డేవిడ్ వార్నర్, ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్ సరసన నిలిచాడు. 

వర్షం వల్ల మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచులో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్..187 పరుగులు చేసింది. 56 బంతుల్లో సెంచరీ చేసిన స్మిత్..మొత్తంగా 66 బంతుల్లో 125 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత  సిడ్నీ థండర్ 19 ఓవర్లలో 62 పరుగులు మాత్రమే చేసి 125 పరుగుల తేడాతో ఓడిపోయింది.  డేవిడ్ వార్నర్ 16 పరుగులు చేయగా.. జోయెల్ డేవిస్ 10 రన్స్ కొట్టాడు. ః