- దారం లాగితే బయటపడ్డ గుట్టు
- ఇద్దరు అరెస్ట్.. 2.90 కేజీల సరుకు సీజ్
మెహిదీపట్నం, వెలుగు: ధూల్‌పేట్ మచిలీపురలో 2.90 కేజీల గంజాయిని ఎస్టీఎఫ్ ఏ టీమ్, ఎక్సైజ్ సిబ్బంది కలిసి పట్టుకున్నారు. రోహిత్ సింగ్ ఇంట్లో గంజాయి ఉందన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంట్లో గంజాయి లభించకపోవడంతో బాత్రూమ్ పైపులను పరిశీలించగా, ఒక దారం కనిపించింది. దారాన్ని లాగితే రెండు పైపుల నుంచి చిన్న ప్యాకెట్లలో కట్టిన 2.936 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో రోహిత్ సింగ్‌తోపాటు రోహన్ సింగ్ ను అరెస్ట్ చేశారు.
మరో కేసులో 1.550 కేజీలు
పురాణాపూల్ రోడ్డులోని గౌతమి మోడల్ స్కూల్ గల్లీలో మాధవ్ సింగ్ ఇంట్లో ఎస్టీఎఫ్ సీ టీమ్ సీఐ వెంకటేశ్వర్లు సిబ్బంది కలిసి పక్కా సమాచారం మేరకు తనిఖీ చేసి 1.550 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మాధవ్ సింగ్, అరుణ్ బాయి గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించి వారి ఆటోను సీజ్ చేశారు.
