16 నుంచి పాత పెన్షన్.. సాధన రథయాత్ర

16 నుంచి పాత పెన్షన్.. సాధన రథయాత్ర

హైదరాబాద్, వెలుగు: సామాజిక భద్రత ఇచ్చే పాత పెన్షన్ ను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్​ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో1,72,000 మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కంట్రిబ్యూషన్​ను నిలుపుదల చేయాలని ఆయన కోరారు. కాగా,  స్థిత ప్రజ్ఞ అధ్యక్షతన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో  సీపీఎస్​ యూనియన్​ జిల్లాల అధ్యక్షుల సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్  33 జిల్లాల అధ్యక్ష , కార్యదర్శులతో కలిసి పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. సంకల్ప యాత్ర ఈ నెల 16 నుంచి 31 వరకు అభీ నహీతో.. కభీ నహీ అనే నినాదంతో  కొనసాగుతుందని ప్రకటించారు.  పాతపెన్షన్ సాధన సంకల్ప రథయాత్రను విజయవంతం చేయాలని సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.