
ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలసీస్, డీఆర్డీఓ(ఐఎస్ఎస్ఏ, డీఆర్డీఓ) పెయిడ్ ఇంటర్న్షిప్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 13.
పోస్టులు: 25
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/ బీటెక్ లేదా ఎంఎస్సీ/ ఎంటెక్‌లో చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు
అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అకాడమిక్‌లో ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 03.
లాస్ట్ డేట్: జులై 13.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు drdo.gov.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.
స్టైఫండ్: డీఆర్డీఓ మార్గదర్శకాల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5000. స్టైఫండ్‌ను రెండు సమాన వాయిదాల్లో అంటే 3 నెలలు పూర్తయిన తర్వాత రూ.15,000, 6 నెలలు పూర్తయిన తర్వాత రూ.15,000 చెల్లిస్తారు. పూర్తి వివరాలకు drdo.gov.in వెబ్సైట్లో చూడగలరు.