కేంద్రం చర్యలతో లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

కేంద్రం చర్యలతో లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

ఆర్థిక వ్యవస్థకు  బూస్టప్ ఇచ్చేలా  కేంద్రం చర్యలతో  స్టాక్ మార్కెట్లు  అనూహ్యమైన  లాభాల్లోకి  వెళ్లాయి. సెన్సెక్స్  ఇవాళ  ఒక్కరోజే  1800  పాయింట్లు  లాభపడింది. గత పదేళ్లలో  ఒక రోజులో  సెన్సెక్స్   ఇన్ని పాయింట్లు  పెరగడం ఇదే  తొలిసారి. వరుస నష్టాల  నుంచి  స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి.  నిర్మలా సీతారామన్  ప్రకటనతో  మార్కెట్లలో  ఫుల్ జోష్ కనిపించింది.  451కు   పైగా పాయింట్లు  లాభపడింది  నిఫ్టీ. గత 4 నెలల తర్వాత  ఒకేరోజు  ఈ స్థాయిలో  నిఫ్టీ లాభపడడం  ఇదే తొలిసారి. మరోవైపు డాలర్ తో  పోలిస్తే  43 పైసలు  బలపడింది రూపాయి.  నిర్మలా సీతారామన్ ప్రకటించిన  ఉద్దీపన  చర్యలను  కార్పొరేట్ మార్కెట్లు  స్వాగతించాయి.