మన్యంలో శిలాయుగం గుర్తులు

మన్యంలో శిలాయుగం గుర్తులు
  • వెలుగులోకి తెచ్చిన చారిత్రక అన్వేషకులు

భద్రాచలం, వెలుగు: కొత్తగూడెం భద్రాద్రి జిల్లా భద్రాచల మన్యంలోని పాత నూగూరు తాలూకా వెంకటాపురం అడవుల్లో బృహత్ శిలాయుగపు ఆనవాళ్లు కన్పించాయి. ప్రస్తుత ములుగు జిల్లా వాజేడు మండలం ఎడ్జెర్లపల్లి నుంచి బొమ్మనపల్లి పోయేదారిలో కొత్తూరు వద్ద ప్రారంభమయ్యే బల్లపరుపు గుట్టల్లోని అడవుల్లో బృహత్ శిలాయుగం ఆనవాళ్లు, వందల సంఖ్యలో రాక్షస గూళ్లు ఉన్నాయి. ఔత్సాహిక చారిత్రక అన్వేషకులు కొండవీటి గోపి టీం అన్వేషణలో గతంలో రాకాసి పట్ణణం, కామిని చెరువు, రాకాసి గుట్ట లాంటి అనేక ఆనవాళ్లను  గోదావరికి ఇరువైపులా వెలుగులోకి తెచ్చారు.  ప్రస్తుతం కొండవీటి గోపి, కోరం పూర్ణ, జాడి వేణు(స్టూడెంట్‍), చెన్నం సమ్మయ్య (ఫారెస్ట్ గైడ్‍) టీం అన్వేషణలో అత్యంత పెద్దదైన ఈ తావును గుర్తించటం విశేషం. టన్నులకొద్ది బరువున్న అతి పెద్ద రాళ్లను ఉపయోగించి చేపట్టిన ఈ నిర్మాణాలు కొన్ని ఎకరాల్లో ఉండటం గమనించదగ్గ విషయం. ఈ ప్రాంతంలో ఆదిమానవుని రాతి పనిముట్లు సైతం దొరికాయి. ఈ ప్రాంతాలను వారసత్వ సంపదగా గుర్తించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

లాభాల్లో ఉన్నా ప్రైవేటైజేషన్.. ఎవరి కోసం?

రోజుకో యాపిల్ తినడం మంచిదేనా?

వ్యక్తిని కట్టేసి కొట్టిన నలుగురు అరెస్ట్​

నిలోఫర్ లో 3 నెలలుగా జీతాల్లేవ్