బీహార్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్‌‌పై రాళ్లతో దాడి

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్‌‌పై రాళ్లతో దాడి
  • వెహికల్​లో సీఎం లేరని అధికారుల వెల్లడి

పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్‌‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఆదివారం పాట్నా జిల్లాలోని సోహ్గిలో ఈ ఘటన జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. రాళ్లు రువ్వే సమయంలో నితీశ్ ఏ వాహనంలోనూ లేరని తెలిపారు. రాళ్లదాడిలో కాన్వాయ్​లోని కొన్ని కార్ల అద్దాలు పగిలిపోయాయన్నారు. అయితే, కొద్దిరోజుల కింద తప్పిపోయిన ఓ యువకుడి డెడ్​బాడీ వారం కింద సోహ్గి దగ్గరలోనే లభ్యమైంది.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ గ్రామస్తులు ఆదివారం సాయంత్రం సోహ్గి దగ్గరలోని పాట్నా-–గయా హైవేపై బైఠాయించారు. ఇంతలో నితీశ్​కుమార్ కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా వెళ్తోంది. ఇది చూసిన గ్రామస్తులు వాహనాలపై రాళ్లు రువ్వారని మీడియా తెలిపింది.