మెట్లమార్గం పైనుంచి జారిన బండరాళ్లు.. మహిళ మృతి

మెట్లమార్గం పైనుంచి జారిన బండరాళ్లు.. మహిళ మృతి

విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న ఆలయంలో దారుణం జరిగింది. ఆలయంలో మెట్ల మార్గం వెడల్పు చేసే పనులు నడుస్తున్న టైమ్ లో… ప్రమాదం జరిగింది. మెట్ల మార్గంలో పక్క స్థలం నుంచి.. బండరాళ్లు మెట్ల మార్గంలో దొర్లుకుంటూ కిందకు జారి పడిపోయాయి. సబ్బవరానికి చెందిన ఆదిరెడ్డి భవానీ తలకు ఆ బండరాళ్లు బలంగా తగలడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కె.కోటపాడు గ్రామానికి చెందిన మరో మహిళకు కూడా బండరాయి తగిలింది. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో.. అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.