మోడీ, మమత ప్రారంభించిన రైలుపై రాళ్ల దాడి

మోడీ, మమత ప్రారంభించిన రైలుపై రాళ్ల దాడి

పశ్చిమబెంగాల్‌లో హౌరా వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై దుండగులు రాళ్లు రువ్వారు. మాల్దాలోని కుమార్‌గంజ్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. సీఎం మమతా బెనర్జీ సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబరు 30వ తేదీన ఈ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైలును ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. కుమార్‌గంజ్ స్టేషన్‌ను దాటుతున్న సమయంలో దాడి జరిగినట్టు ఈస్టర్న్ రైల్వే వెల్లడించింది. దుండగులు రాళ్లు విసిరారని, అద్దాలు పగిలినట్లు ఓ ప్యాసింజర్ వెల్లడించాడు. దాడిలో రైలులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. రాళ్ల దాడిపై రైల్వేశాఖ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. వీటిలో ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. వర్చువల్‌గా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. మొత్తం 564కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణికులకు మూడు గంటల సమయం ఆదా కానుంది. బర్సోయ్, మాల్దా, బోల్పూర్ స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఇందులో మొత్తం 16 బోగీలుంటాయి. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు.