కేదార్​నాథ్​ యాత్రకు బ్రేక్​... మంచులో యాత్రికుల అవస్థలు

కేదార్​నాథ్​ యాత్రకు బ్రేక్​... మంచులో యాత్రికుల అవస్థలు

మంచు తుఫాను కారణంగా ఉత్తరాఖండ్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. దాదాపు 136 రోడ్లు బ్లాక్ అయ్యాయి. రోడ్లపై మంచుగడ్డలు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుంది. దీనికి తోడు కొండ చరియలు కూడా విరిగి పడుతున్నాయి. కేదార్​నాథ్ యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా యాత్రకు బ్రేక్​ పడింది.  భారీగా మంచు తుఫాను కురుస్తుండటంతో..కొంతమంది యాత్రికులు మంచులో కూరుకుపోయారు. రెస్క్యూ టీం మంచులో కూరుకుపోయిన యాత్రికులను రక్షించారు.

యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని, కేదార్‌నాధ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. యాత్రికులు  ఇటు వైపు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వస్తే మంచు తుపానులో చిక్కుకునే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు.  ప్రభుత్వం మాత్రం యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. ఉత్తర కాశీలోని  రోడ్లను మంచు కప్పేసింది. పౌడీలో,తెహ్రీలో, చమోలీలో, డెహ్రాడూన్ లో, బాగే షేర్ లో, చంపావత్, ఆల్మోరా, నైనిటాన్, హరిద్వార్ ప్రాంతాలు అసలు ఏమీ కనపడటం లేదు.   కాశీ, అలకనంద, భగీరథీ, మందాకిని, గంగా నదులు గడ్డకట్టాయి. గంగోత్రి, భద్రీనాథ్, కేదార్ నాథ్, యమునోత్రి, చార్ ధామ్ యాత్రల మార్గాలు అన్ని మూసుకుపోయాయి.