
తిరుమల తిరుపతిలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఆఫ్ లైన్లో జారీ చేస్తున్న 3 వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని ఇవాళ్టి(మంగళవారం) నుంచి నిలిపివేశారు. ఎప్పటి నుంచి టోకెన్లు జారీ చేస్తారన్న విషయాన్ని తర్వాత తెలియజేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకెన్ల కోసం రావద్దని చెప్పారు.
తిరుపతి లో కంటైన్మెంట్ నిబంధనలు అమల్లో ఉండటంతో టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.