22 రోజులుగా తిరువనంతపురం ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన బ్రిటిష్ ఫైటర్ జెట్.. ఎయిర్ ఇండియా హ్యాంగర్ కు తరలింపు..

22 రోజులుగా తిరువనంతపురం ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన బ్రిటిష్ ఫైటర్ జెట్.. ఎయిర్ ఇండియా హ్యాంగర్ కు తరలింపు..

జూన్ 14న తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయిన బ్రిటిష్ F-35B ఫైటర్ జెట్ ను ఆదివారం ( జులై 6 ) ఎయిర్ ఇండియా హ్యాంగర్ కు తరలించారు. ఫైటర్ జెట్ కు  మరమత్తులు చేసేందుకు బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నుండి సాంకేతిక నిపుణుల బృందం ఇండియాకు కేరళకు చేరుకుంది.F-35 ఫైటర్ జెట్ ను ఎయిర్ పోర్టు నుండి ఎయిర్ ఇండియా హ్యాంగర్‌కు తరలించారు, అక్కడ UK రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సాంకేతిక బృందం దానిని మరమ్మతు చేసి తిరిగి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది.

జూన్ 14న వాతావరణ ప్రతికూలతల కారణంగా బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. యూకేకి చెందిన HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ కి చెందిన ఈ విమానం 22 రోజులుగా తిరువనంతపురం ఎయిర్ పోర్టులోనే నిలిచిపోయింది.

25 మంది యూకే ఇంజనీరింగ్ బృందం:

ఆదివారం ( జూలై 6 ) బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నుండి దాదాపు 25 మంది సాంకేతిక నిపుణుల బృందం ఫైటర్ జెట్ కు మరమత్తులు చేసేందుకు ఎయిర్‌బస్ A400M అట్లాస్‌లో ఇండియా చేరుకుంది. ఫైటర్ జెట్ స్థానికంగా రిపేర్ చేసే ఛాన్స్ ఉందా లేక విడదీసి UKకి తిరిగి పంపించాలా అన్నది నిపుణుల బృందం డిసైడ్ చేయనుంది.

ఇండియాకు యూకే కృతఙ్ఞతలు:

ఫైటర్ జెట్ విషయంలో ఇండియా సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి. భారత అధికారులు, విమానాశ్రయ బృందాలు అందించిన మద్దతు, సహకారానికి UK చాలా కృతజ్ఞతతో ఉందని తెలిపారు బ్రిటిష్ ప్రతినిధి.