ఆర్సీబీని కలవర పెడుతున్న  విచిత్ర సెంటిమెంట్.. షాక్లో బెంగళూరు ఫ్యాన్స్

ఆర్సీబీని కలవర పెడుతున్న  విచిత్ర సెంటిమెంట్.. షాక్లో బెంగళూరు ఫ్యాన్స్

IPL 2026 Final: ఐపీఎల్ క్రికెట్ ప్రపంచంలో రికార్డుల వేట మాత్రమే కాదు, కొన్నిసార్లు విచిత్రమైన సెంటిమెంట్లు కూడా ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తుంటాయి. క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌ను కేవలం ఒక ఆటలా కాకుండా ఎంతో భావోద్వేగంగా చూస్తుంటారు. అయితే గత కొన్ని సీజన్లుగా ఒక విచిత్రమైన సెంటిమెంట్‌ కొనసాగుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఆసక్తికరమైన లెక్కలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 

2022లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ కి సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా, తొలి ఏడాదిలోనే ట్రోఫీని అందించాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో, 2023 ఐపీఎల్ సీజన్ ఫైనల్లో గుజరాత్ అనూహ్యంగా ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఒక ఏడాది విజేతగా నిలిచి, ఆ తరువాతి ఏడాది టైటిల్ చేజార్చుకోవడం ఇక్కడ గమనార్హం.

శ్రేయస్ అయ్యర్ కి కూడా సేమ్ సీన్ రిపీట్: 
హార్దిక్ పాండ్యా విషయంలో జరిగింది, 2024, 2025 సీజన్లు నిరూపించాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా 2024లో అడుగు పెట్టిన శ్రేయస్ అయ్యర్, జట్టును అద్భుతంగా నడిపించి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ గెలుపుతో కోల్‌కతా క్యాంప్‌లో పండగ వాతావరణం నెలకొంది. కానీ ఈ వింత సెంటిమెంట్ శ్రేయస్‌ను కూడా వదలి పెట్టలేదు.. సరిగ్గా ఆ మరుసటి ఏడాది (2025) సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి వెళ్లిన, రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరుసగా ఇద్దరు కెప్టెన్లు ఒక ఏడాది గెలిచి, ఆ తరువాతి ఏడాది ఓడిపోవడంతో ఈ సెంటిమెంట్ కాస్తా నెట్టింట ట్రెండ్ అవుతుంది. 

►ALSO READ | అహ్మదాబాద్‌లో క్లోజింగ్ సెర్మనీ.. కైలాష్ ఖేర్ పాటలు, వరుణ్ ధావన్ డాన్సులు.. పూనకాలు లోడింగ్!
 
2025 విజేతగా ఆర్సీబీ.. మరి 2026లో ఏంటీ పరిస్థితి: 
ఇక్కడే అసలైన ట్విస్ట్ 2025 సీజన్‌లో జరిగింది. 2025 ఐపీఎల్‌లో రజత్ పాటీదార్ అద్భుతమైన కెప్టెన్సీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. దశాబ్దాలుగా కరవైన కప్‌ను సాధించి పెట్టడంతో అభిమానులు పాటీదార్‌ను నెత్తిన పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ వింత సెంటిమెంట్ ఆర్సీబీ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ తరహాలోనే 2025లో ట్రోఫీ గెలిచిన రజత్ పాటీదార్, ప్రస్తుత 2026 సీజన్ ఫైనల్లో ఓడిపోబోతున్నాడా అంటూ జోరుగా చర్చ జరుగుతుంది. 

* 2022: హార్దిక్ పాండ్యా – ఐపీఎల్ విజేత (Won IPL)
* 2023: హార్దిక్ పాండ్యా – ఐపీఎల్ రన్నరప్ (Lost IPL)
* 2024: శ్రేయస్ అయ్యర్ – ఐపీఎల్ విజేత (Won IPL)
* 2025: శ్రేయస్ అయ్యర్ – ఐపీఎల్ రన్నరప్ (Lost IPL)
* 2025: రజత్ పటీదార్ – ఐపీఎల్ విజేత (Won IPL)
2026: ఎవరు గెలుస్తారంటే?

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్: 
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ లెక్కలకు సంబంధించిన మీమ్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ స్క్రిప్ట్ రైటర్స్ చాలా పక్కాగా ప్లాన్ చేశారంటూ కొందరు వ్యాఖ్యానిస్తుంటే, ఈసారి ఈ సెంటిమెంట్‌ను బద్దలు కొట్టి ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, గత మూడేళ్లుగా సాగుతున్న ఈ విచిత్ర సెంటిమెంట్, ఈ 2026 సీజన్‌లో ఎలాంటి మలుపు తిరుగుతుందో అనేది వేచి చూడాలి.