29 మందిని కరిచిన కుక్కను కొట్టిచంపారు.. పోస్ట్మార్టమ్ చేస్తే.. షాకింగ్ న్యూస్

29 మందిని కరిచిన కుక్కను కొట్టిచంపారు.. పోస్ట్మార్టమ్ చేస్తే.. షాకింగ్ న్యూస్

చెన్నైలో ఒకే రోజు అదీ గంటల వ్యవధిలో 29 మందిని కుక్క కరిచిన ఘటన తమిళనాట సంచలనంగా మారింది. మంగళవారం(నవంబర్ 21)  రాత్రి  జీఏ రోడ్ లో కేవలం రెండు గంటల వ్యవధిలో ఐదుగురు పిల్లలతో సహా మొత్తం 29 మందిని కుక్క తీవ్రంగా గాయపర్చింది. గాయపడిన వారికి ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 29 మందిని కరిచిన తర్వాత వీధి కుక్కును  స్థానికులు కొట్టి చంపారు.. కుక్క మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేశారు వెటర్నరీ డాక్టర్లు..రిపోర్టులో కుక్కకు రేబీస్ పాజిటివ్ అని తేలిందని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారి తెలిపారు. కుక్క దాడిలో గాయపడిన వారికి రేబీస్ వ్యాక్సిన్ ను అందజేశారు డాక్టర్లు.. ఈ వ్యక్తులను అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తెలిపారు. 

ఈ సంఘటనతో తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.  గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయపురం ప్రాంతంలో ఉన్న కుక్కలను పట్టుకొని వాటికి టీకాలు వేయించారు. చెన్నై నగరంలో మొత్తం ఐదు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల ద్వారా కుక్కులకు టీకాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. త్వరలో చెన్నై నగరంలో ఉన్న కుక్కల జనాభా గణన కూడా చేపట్టనున్నట్లు తెలిపింది తమిళనాడు ప్రభుత్వం. నవంబర్ 27 నుంచి కుక్కల గణన చేపట్టునున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు. 

చెన్నై నగరంలో పెద్ద సంఖ్యలో వీధి కుక్కలున్నట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తెలిపింది. వీధి కుక్కలకు టీకాలు వేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2023లో మొత్తం 17 వేలకు పైగా వీధి కుక్కులకు పట్టుకొని తనిఖీ చేసినట్లు తెలిపారు. వీటిలో 13 వేల కుక్కలను వైద్యం అందించినట్లు తెలిపారు.