ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై వీధి కుక్కల దాడి.. 

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై వీధి కుక్కల దాడి.. 

హనుమకొండ జిల్లా కాజీపేటలో పిల్లలపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 18 నెలల పాపతో పాటు మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. 

రాజీవ్ గృహకల్పలో ఇంటి ముందు పిల్లలు ఆడుకుంటున్న సమయంలో వారిపై వీధికుక్కలు దాడి చేసి, గాయపర్చాయి. తీవ్రంగా గాయపడ్డ పిల్లలను వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

ఈ ఘటనపై GWMC అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాపోయారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ లో పర్యటించిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.