నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

 నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

వీధి కుక్కలు  రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా కుత్బుల్లాపూర్ లో  నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి చేశాయి. ఉదయం ఆరు బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి అనన్యపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.  చిన్నారిపై దాడి చేసిన కాసేపటిరకే మరో మహిళపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.  

దుండిగల్ మున్సిపాలిటీ  పరిధిలో గత కొద్ది నెలలగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని.. అయినప్పటిరకీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  గాయపడిన నాలుగేళ్ల చిన్నారిని , మహిళను   చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకుని వీధి కుక్కల నుండి చిన్న  పిల్లల ప్రాణాలు కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.