
మాదాపూర్ లో స్ట్రీట్ వెండర్స్ ధర్నా చేశారు. ఐటీసీ కోహినూర్ సమీపంలోని ఫుట్ ఫాత్ పై చిరు వ్యాపారుల దుకాణాలను జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి .. కుమార్ ఆంటీ విషయంలో ఫుడ్ స్టాల్స్‌కు ఇతర వ్యాపారాలకు అనుమమతి ఇచ్చారని చిరువ్యాపారులు తెలిపారు.కాని ఇప్పుడు దుకాణాలను తొలగించడంపై ఆందోళన చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని స్ట్రీట్ వెండర్స్ నిరసన తెలిపారు.