వరంగల్ సిటీలో మురుగు నీరుతో అవస్థలు..!

వరంగల్ సిటీలో మురుగు నీరుతో అవస్థలు..!

కాశీబుగ్గ(కార్పొరేషన్​),వెలుగు: గ్రేటర్​ వరంగల్​ సిటీలో వర్షం కురిసిన ప్రతిసారి కాలనీలు జలమయమవుతున్నాయి. గ్రేటర్​ వరంగల్​ సిటీలోని 24వ డివిజన్​లోని గోపాల స్వామి టెంపుల్​ ప్రాంతంలోని ఏ టూ జెడ్  మెడికల్​ షాపు వద్ద డ్రైనేజీలోని మురుగు నీరు రోడ్డు పైకి రావడంతో అక్కడే ఉన్న బస్​ స్టాఫ్​ చుట్టూ మురుగు నీరు నిల్చిపోవడంతో ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్నారు. మ్యాన్​హోల్స్​, డ్రైనేజీల నుంచి మురుగు బయటికి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.