ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి : అలుగుబెల్లి నర్సిరెడ్డి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి : అలుగుబెల్లి నర్సిరెడ్డి

సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రచార జాత సోమవారంసూర్యాపేటకు చేరింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించే విధంగా కృషి చేయాలని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలు విద్యపై వారి సంపాదనలో అధిక శాతాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుందని,  తద్వారా ఆర్థికంగా దిగజారే పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, టీచర్​పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని డిమాండ్​చేశారు.