
ఇటీవల ప్రధాని మోదీ ఉక్రెయిన్ లో పర్యటించిన విషయం తెలిసింది.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు.. ఉక్రెయిన్ లో తాజా పరిస్థితి, కాల్పుల విరమ ణ వంటి పలు కీలక అంశాలపై మోదీ చర్చించిన విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ పర్యటన ముగిసిన వారం తర్వాత ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మంగళవారం (ఆగస్టు 27) ఫోన్ చేసి మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ.. పుతిన్ తో చర్చించారు. ఉక్రెయిన్ పర్యటన వివరాలను పంచుకోవ డం తోపాటు సంక్షోభానికి ముగింపు పలికే మార్గాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.
Also Read :- సూసైడ్ డ్రోన్లను పరీక్షించిన కిమ్
ఇదిలా ఉంటే.. ఇటీవల ఉక్రెయిన్ లో పర్యటించిన ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రశంసలు కురిపించారు. మోదీ పర్యటన శాంతిసందేశం పంపిందన్నారు. అక్కడ కొనసాగుతున్న మానవతా సాయానికి మద్దతుగా ఉన్నారని బైడెన్ చెప్పారు.