
యాదాద్రి భువనగిరి : దళితులను అవమానిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ACP భుజంగరావు. శుక్రవారం మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో పౌర హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కంప్యూటర్ యుగంలోనూ మాల, మాదిగ, దళితులకు ఆలయాల్లో ప్రవేశాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు.
మనుషులంతా ఒక్కటేనని కులం పేరుతో దూషించడం చట్టపరంగా నేరమని తెలిపారు. ముఖ్యంగా మానవ హక్కులపై గ్రామాల ప్రజలు తెలుసుకోవాలని.. దళితులను అవమానించిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.