స్ట్రింగ్ మెటావర్స్ ఆదాయం రూ.1,069 కోట్లు

స్ట్రింగ్ మెటావర్స్ ఆదాయం రూ.1,069 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: డిజిటల్, ఏఐ ఆర్థిక మౌలిక సదుపాయాలు అందించే హైదరాబాద్ ​కంపెనీ స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏఐ మౌలిక సదుపాయాలు, గేమింగ్ రంగాలలో సాధించిన వృద్ధి వల్ల ఆదాయం రూ.1,069.11 కోట్లకు చేరింది. 

గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.407.36 కోట్లుగా ఉంది. కంపెనీ పన్నుకు ముందు లాభం (పీబీటీ) రూ.103.51 కోట్లుగా, నికరలాభం రూ.102.52 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఇబిటా ఏడాది ప్రాతిపదికన 170 శాతానికి పైగా పెరిగి రూ.121.88 కోట్లకు చేరుకుంది. 

నాలుగో క్వార్టర్‌‌‌‌లో కంపెనీ రూ.359.40 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.  కంపెనీ తన అంతర్జాతీయ కార్యకలాపాలను యూఏఈ, హాంగ్‌‌‌‌కాంగ్, సింగపూర్, కెనడా దేశాలకు విస్తరించింది.