ప్రణయ్‌‌, సమీర్‌‌ ఔట్‌‌

ప్రణయ్‌‌, సమీర్‌‌ ఔట్‌‌

సిడ్నీ: ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో ఇండియన్‌‌ షట్లర్ల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో ఐదో సీడ్‌‌ హెచ్‌‌.ఎస్‌‌. ప్రణయ్‌‌ 19–21, 13–21తో రెండోసీడ్‌‌ కొడాయ్‌‌ నరోకా (జపాన్‌‌) చేతిలో ఓడాడు. మరో మ్యాచ్‌‌లో సమీర్‌‌ వర్మ 12–21, 13–21తో లిన్‌‌ చున్‌‌ యి (చైనీస్‌‌తైపీ) చేతిలో ఓడాడు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో ఆకర్షి కశ్యప్‌‌ 17–21, 12–21తో పాయ్‌‌ యు పో (చైనీస్‌‌తైపీ) చేతిలో కంగుతిన్నది. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో సుమీత్‌‌–సిక్కి రెడ్డి 12–21, 14–21తో జెన్‌‌ బాంగ్‌‌–వీ యా జిన్‌‌ (చైనా) చేతిలో  ఓడారు.