- టీచర్ వేధింపులే కారణమని అనుమానం
ఎల్ బీనగర్,వెలుగు: సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో స్టూడెంట్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిబట్ల పోలీసులు తెలిపిన ప్రకారం.. కూకట్ పల్లికి చెందిన దేవపంగు వివేక్(14) నాదర్ గుల్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో 9వ క్లాస్ చదువుతున్నాడు. గురువారం సాయంత్రం 4:30 గంటల సమయంలో వివేక్ హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు టవల్స్ తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తోటి విద్యార్థులు చూసి టీచర్స్ కు చెప్పగా పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఓ టీచర్ కొట్టడంతోనే వివేక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.